శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి మాదాపూర్,కొండాపూర్,లింగంపల్లి ,మియాపూర్ హఫీజ్‌స్పేట్ ,హైదర్నగర్ ,ఆల్విన్ కాలనీ,పాపిరెడ్డి నగర్ డివిజన్‌లలో స్థానిక బిజెపి నాయకుల ఆహ్వానం మేరకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ,జిల్లా, డివిజన్ అధ్యక్షులు, బీజేవై నాయకులు, మహిళా మోర్చా, మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీలో..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆల్విన్ కాలనీ డివిజన్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద స్థానిక బిజెపి నాయకుల ఆహ్వానం మేరకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ,జిల్లా, డివిజన్ అధ్యక్షులు, బీజేవై నాయకులు, మహిళా మోర్చా, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.