శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం 5వ విడత కార్యక్రమం ఘనవిజయం సాధించింది. ఈ శిబిరానికి స్థానిక నివాసితుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఆశావాహుడు (BRS) Md. అలావుద్దీన్ పటేల్ మాట్లాడుతూ.. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను వినియోగించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. కొండాపూర్ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను మరింతగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.






