మియాపూర్‌లో ఘనంగా మట్టి వినాయకుల పంపిణీ.. పర్యావరణ పరిరక్షణకు యలమంచి ఉదయ్ కిరణ్ ట్రస్ట్ పిలుపు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): పర్యావరణ పరిరక్షణతోపాటు సంప్రదాయాలను కాపాడే లక్ష్యంతో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మియాపూర్–మక్త మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్‌తో పాటు మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగాపురం కాలనీలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ప్రజయ్ షెల్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యలమంచి ఉదయ్ కిరణ్, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. మన సంప్రదాయాలను గౌరవిస్తూనే పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ప్రజల నుంచి లభించిన స్పందన అభినందనీయమని పేర్కొంటూ, యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. అదేవిధంగా శ్రీరంగాపురం కాలనీలో యలమంచి ఉదయ్ కిరణ్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు కేశవరావు, మూర్తి తదితరులతో కలిసి ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. మన సంప్రదాయం – మన బాధ్యత, మన పండుగ – మన పర్యావరణం అనే సందేశంతో ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని కోరారు. పండుగ సంబరాలను కొనసాగిస్తూనే ప్రకృతిని కాపాడటం అందరి బాధ్యత అని అన్నారు.

ఈ రెండు కార్యక్రమాల్లో శంకర్, గోపాల కృష్ణ, కేశవరావు, మూర్తి, రాంచందర్ గౌడ్, రవి కుమార్, రాధమ్మ, విజయలక్ష్మి, సుజాత, ప్రశాంత్, శ్రీనివాస్, విజయ్, రమేష్, శరత్, సుబ్బు, శివ, రాంబాబు, రాధాకృష్ణ, వంశీ, రత్నచారి, సాంబశివరావు, జయ, శ్రీకాంత్, సతీష్, నవీన్, జయలక్ష్మి, సంజయ్, ప్రవీణ్, గురువులు, నాగసాయి, శశి, రామారావు, వెంకట్, జ్యోతి, సాయి కిరణ్, సాయమ్మ, వేదాన్ష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, యువత, మహిళలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here