పాపిరెడ్డి కాల‌నీలో మారబోయిన రవి యాదవ్ మ‌న బ‌స్తీ బాట

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని పాపిరెడ్డి కాల‌నీలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు మారబోయిన రవి యాదవ్ మ‌న బ‌స్తీ బాట కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానిక ప్ర‌జ‌ల‌ను అడిగి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. స్థానికంగా ప్ర‌జ‌లు తాగునీటికి తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నార‌ని, డ్రైనేజీ వ్య‌వ‌స్థ అస్తవ్య‌స్తంగా మారింద‌ని, దుర్గామాత ఆల‌యం స‌మీపంలో డ్రైనేజీ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల నివాసాల్లోకి మురుగు నీరు చేరుతుంద‌ని, ర‌హ‌దారులు స‌రిగ్గా లేవ‌ని, వీధి దీపాల స‌మ‌స్య ఉంద‌ని అన్నారు. వెంట‌నే సంబంధిత శాఖ‌ల‌కు చెందిన అధికారుల‌పై ఒత్తిడి తెచ్చి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు.

ఈ కార్యక్రమం లో కే.ఎన్.రాములు, మల్లేష్ ముదిరాజ్, వెంకటాచారి, గడ్డం శ్రీ‌నివాస్, సోమనాథ్, నవీన్ గౌడ్, కొండకల్ శ్రీ‌నివాస్, కృష్ణ, ఆర్.జమ్మయ్య, శంకర్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, శ్రీకాంత్ యాదవ్, రాజు గౌడ్, రాంబాబు, రాజు గౌడ్, శంకర్, అనిల్ యాదవ్, రాజు గౌడ్, వెంకట్, కృష్ణ, అశోక్, నర్సింహా, శ్రీకాంత్ రెడ్డి, ఇల్లు మల్లేష్, పద్మ, అనిత, వెంకట్ యాదవ్, నాగమణి, గుంజ నాగమణి, లక్ష్మి, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here