శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ రామకృష్ణ నగర్ కాలనీలో దసరా పర్వదినం పురస్కరించుకుని శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పూజ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి వేడుకలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అమ్మవారి ఆశీస్సులతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో , శాంతి సౌభాగ్యలతో జీవించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దాత్రినాథ్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్, సురేష్, హరికృష్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






