శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా ఎం.రవికుమార్ యాదవ్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని తనకు అప్పగించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ ఆశీర్వాదంతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా మారుస్తానని అన్నారు.