కమల ప్రసన్ననగర్ లో పట్టభద్రుల ఓటరు నమోదు

వివేకానంద‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద‌న‌గ‌ర్ డివిజన్ ప‌రిధిలోని కమల ప్రసన్ననగర్ లో మంగ‌ళ‌వారం కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావు లు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ప‌ర్య‌టించి సమస్యలను అసోసియేషన్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. డిగ్రీ జిరాక్స్ మెమో లేదా ప్రొవిజన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఓటరు కార్డు/పాన్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్ /కరెంట్ బిల్లు/ ఫోన్ బిల్లు తదితర ఏదైనా అడ్రస్ ప్రూఫ్‌ తో పాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, సెల్ నంబర్, ఈ మెయిల్ తో ఫాం నం 18 దరఖాస్తు నింపి సంతకంతో ఓట‌రు న‌మోదుకు ప‌త్రాల‌ను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మనమందరం పని చేయాలని అన్నారు. డివిజన్ పరిధిలో పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ మెంబర్ చంద్రశేఖర్, స్థానిక అసోసియేషన్ సభ్యులు రాఘవులు, శ్రీశైలం గౌడ్, శ్రీనివాస్, వినోద్, పద్మారావు, ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here