- న్యాయం జరిగే వరకు పోరాడుతామని హామీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): అధికార తెరాస పార్టీకి చెందిన నాయకుల ఆగడాలకు, అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. మొయినాబాద్‌లో స్థానిక తెరాస నేత చేతుల్లో అత్యాచారం, హత్యకు గురైన నజియా బేగం కుటుంబాన్ని ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన నజియా బేగం సోదరి అఫ్రీం బేగంకు రూ.30వేల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నజియా బేగంపై తెరాస నేత చేపట్టిన దారుణమైన చర్యను ప్రభుత్వం మొదటి రోజు నుంచే మరుగున పడేలా చేస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు.







