చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారితో తెరాస సీనియర్ నాయకుడు మిరియాల రాఘవ రావు, యువజన నాయకుడు ప్రీతంలు ఓటర్లుగా నమోదు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలబర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
సోమవారం చందానగర్ డివిజన్ పరిధిలోని వెంకటాద్రి కాలనీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న పట్టభద్రులకు ఓటర్ నమోదు ఫాం 18లను అందజేశారు. అనంతరం వారిచే ఫాంలను నింపించి వాటిని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు విధిగా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. డివిజన్ లో పెద్ద సంఖ్యలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియలో పట్టభద్రులకు ఏమైనా సందేహాలు ఉంటే అక్కడే నివృత్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేందర్,
కౌశిక్, శ్రీకార్, విశాల్, తక్షక్ తదితరులు పాల్గొన్నారు.