శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎన్‌క్లేవ్ కాలనీ నుండి మియాపూర్ బొల్లారం చౌరస్తా వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను HMDA DE దీప్తి, AE అషితోష్ తో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ బీకే ఎన్‌క్లేవ్ కాలనీ నుండి మియాపూర్ బొల్లారం చౌరస్తా వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించడం జరిగిందని, నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని , ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, యుద్ధప్రాతిపదికన రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అన్నారు.






