నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసం ముస్లిం మైనార్టీలకు పవిత్రమైన మాసమని, ఎంతో నిష్టతో ఉపవాస దీక్ష చేసి రంజాన్ పండగను జరుపుకోవడం జరుగుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో మజీద్ దగ్గర పేద ముస్లిం మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం అందజేసిన రంజాన్ తోఫా ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంత్ నాయక్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షుడు బి. విఠల్, ఎన్టీఆర్ నగర్, కోశాధికారి వేణు గోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ నగర్ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, బిజెపి నాయకులు నర్సింగ్ నాయక్ , శంకర్, ప్రకాష్, మసీదు ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ సలీం, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ షకీల్ పాల్గొన్నారు.