నమస్తే శేరిలింగంపల్లి: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి వడ్డెర బస్తీలో పలు అంశాలపై పోలీస్ కళా బృందం తో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, వాటి దుర్వినియోగం, మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న షీ టీమ్స్‌పై అవగాహన కల్పించారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాలు, సామాజిక దురాచారాలు, విద్యార్థుల పాత్ర, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కళాప్రదర్శనల ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించారు. రోడ్డు ప్రమాదాలు, మొబైల్ వినియోగం,100 డయల్ ప్రాముఖ్యత, మానవ అక్రమ రవాణా, మూఢనమ్మకాలు తదితర అంశాలపై రాయదుర్గం పోలీసులు ప్రదర్శనలిచ్చి ప్రజలకు అవగాహన కల్పించారు.