నడిగడ్డ తండాలో రంజాన్ వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, మార్చి 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): త్యాగం ,దయ ,సానుభూతి, క్రమశిక్షణ, దానాగుణాలను నేర్పే పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ఈద్ – ఉల్- ఫితర్ సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో ఉన్న సీనియర్ నాయకుడు మహమ్మద్ సలీం, మక్త మహబూబ్ పేట్ విలేజ్ లోని సీనియర్ నాయకుడు మహమ్మద్ సద్దాం నివాసాలకు స్థానిక నాయకులతో కలిసి వెళ్లి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పవిత్ర మాస రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా నాయకులు స్వామి నాయక్, అబ్రహాం, సుధాకర్, కమలాకర్, శ్రీను, సంపత్, ఇలియాస్, అబ్బాస్, అసిసోద్దిన్, గరీబ్, జాఫర్, రవి నాయక్, మక్త మహబూబ్ పేట్ వాసులు సలీం, షేక్ మహబూబ్, అలీం, అఫ్రోజ్, రుక్ముద్దీన్, అలీఫ్, నరేష్, శివ, అవినాష్, చందు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here