నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రథమ ప్రాధాన్య ఓటు బిజెపి అభ్యర్థి ఎన్.రాంచందర్ రావుకి వేసి గెలిపించాలని బిజెపి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ పోటీదారు కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హుడు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, రికార్డు స్థాయిలో శాసన మండలిలో తన గళాన్ని వినిపించిన రాంచందర్ రావుని తిరిగి గెలిపించాలని ఆమె కోరారు. విద్యావంతులైన ఓటర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కెసిఆర్ ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తించాలని అన్నారు. నిరుద్యోగ పట్టభద్రులు నిరోద్యగ భృతి ఇస్తానని మోసం చేసిన కెసిఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఓటింగ్ శాతం పెంచే విధంగా అందరూ అధిక సంఖ్యలో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. అధికార పార్టీ ప్రలోభాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.






