నమస్తే శేరిలింగంపల్లి: నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టీస్ కమిషన్ రంగారెడ్డి జిల్లా చైర్మన్‌గా మియాపూర్‌కు చెందిన రాచమళ్ల కరణ్ గౌడ్ నియామకమయ్యారు. కమిషన్ రాష్ట్ర చైర్మన్ డానియేల్, అధ్యక్షులు సర్వేందర్‌లు కరణ్ గౌడ్‌కు నియామక పత్రాన్ని అందజేసి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కరణ్‌గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి భాద్యతలు అప్పగించిన కమిషన్ జాతీయాధ్యక్షుడు మహతాబ్ రాయ్, రాష్ట్ర చైర్మన్, అధ్యక్షులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో మనవ హక్కులు, సామాజిక న్యాయం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరోళ్ల సురేష్ ముదిరాజ్, పెద్దమల్లేష్, చిన్నమల్లేష్, సాయిగౌడ్, వంశీకిరణ్ ముదిరాజ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
