నమస్తే శేరిలింగంపల్లి: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీ పురం కాలనీలో కాలనీ వాసులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను భవానిపురం కాలనీలో ఘనంగా చేపట్టారు. కాలనీ వాసులు, విద్యార్థినీవిద్యార్థులు, యువకులు, మహిళలు, చిన్నారులు దేశ భక్తి నినాదాలు చేస్తూ జాతీయ జెండాతో పాదయాత్ర చేశారు. స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని కాలనీ వాసులు దేశభక్తిని చాటుకున్నారు.