శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ 75 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పించారు. ప్రజాభివృద్దే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ సుపరిపాలన సాగిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి సంక్షేమ పథకం పేదవారికి చేరినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టే ముందు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. యువత మంచి స్ఫూర్తిదాయక ఆలోచనలతో, గొప్ప గొప్ప లక్ష్యాలతో ముందుకువచ్చి దేశ, రాష్ట్ర, ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఎందరో మహానుభావుల త్యాగపలంతో స్వతంత్ర భారతం తెచ్చిన మహానీయులను స్మరించుకోవడం మన విధి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు స్వతంత్ర భారతానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల ఆగస్ట్ 15 న ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ ఆకాంక్షించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, అనాధికారులకు, పాత్రికేయ మిత్రులకు ప్రభుత్వ విప్ గాంధీ 75 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here