హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని సాయినగర్, జనప్రియ నగర్‌లలో అయోధ్య రామ మందిర నిర్మాణం నిమిత్తం నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ నిధిని సేకరించారు. ఈ కార్యక్రమంలో బోయిని అనూష మహేష్ యాదవ్, రవి గౌడ్, జితేందర్, బాబు రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్, కార్తీక్, రవి ముదిరాజ్, అశోక్, నవీన్, మనోజ్ కార్తీక్, రఘు, మల్లేష్ పాల్గొన్నారు.