చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అన్ని ప్రాంతాల ప్రజల సమూహమే హైదరాబాద్ అని, ధైర్యంగా జీవించడానికి అనువైన ప్రాంతంగా పేరు చెందిందని బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఒడియా కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ 2021 క్యాలెండర్ ను ఆదివారం చందానగర్ లోని జనం కోసం కార్యాలయంలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా మంది ఓట్లను తొలగించారని, ఇది పలు అనుమానాలకు తావిచ్చిందని, ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యతగా గుర్తించాలని కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మహాపాత్ర, బారిక్, లక్ష్మణ్, రాజ్ జైశ్వాల్, దేవమని యాదవ్, హేమబాబుతోపాటు ఒడియా కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.