ఎంపీ రంజిత్ రెడ్డి చొరవతో శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రైవేట్ నిధులు

  • ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధునీకరణ కు రహెజా గ్రూప్ తోడ్పాటు
  • 45 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల కేటాయింపు
  • చెక్ ను ఎంపీ రంజిత్ రెడ్డి కి అందజేసిన రహెజా సీఈఓ శ్రవణ్.

నమస్తే శేరిలింగంపల్లి: ఆరోగ్య చేవెళ్ల దిశగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్. జి. రంజిత్ రెడ్డి మరో అడుగు ముందడుగు వేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించి, పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఎంపీ తలపించారు. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సివిల్ వర్క్స్, శానిటరీ అరేంజ్మెంట్స్, తాగు నీరు, ఎలక్ట్రిసిటీ మొదలగు మౌలిక సదుపాయాల కొసం నిధులు సమకూర్చాలని రహేజా గ్రూప్ సీఈఓ శ్రావణ్ ను సంప్రదిస్తూ లేఖ రాశారు.

చెక్ ను ఎంపీ రంజిత్ రెడ్డి కి అందజేస్తున్న రహెజా సీఈఓ శ్రవణ్

అందుకు స్పందించిన రహేజా గ్రూప్, వారి సిఎస్ఆర్ నిధుల నుంచి 45 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఈ నిధులతో శేరిలింగంపల్లి లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునికరించి, పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే అరికేపూడీ గాంధీ సహకరిస్తున్నారని అయన వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here