నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి గంగారం గ్రామానికి చెందిన యువ నాయకుడు కంది సాయికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సోమవారం నాడు మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కంది సాయికుమార్ సీఎం జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జగన్ చేస్తున్న కృషిని సాయికుమార్ కొనియాడారు. జగన్ లాంటి విజన్ ఉన్న నేత ముఖ్యమంత్రిగా లభించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు.