ఆరెకపూడి గాంధీకి మిరియాల రాఘవ రావు, ప్రీతమ్ శుభాకాంక్షలు

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌భుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవ రావు, యువజన నాయకుడు మిరియాల ప్రీతమ్ లు గురువారం గాంధీని క‌లిసి ఆయ‌న‌కు పూల మొక్కను అందజేసి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న నాయకుడు ఆరెకపూడి గాంధీ అని అన్నారు. ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా వారికి ఆరెక‌పూడి గాంధీ అండ‌గా నిలుస్తున్నార‌ని అన్నారు. ఇలాంటి పుట్టినరోజుల‌ను ఆయ‌న‌ మరెన్నింటినో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రజాసేవలో ఉంటూ మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆ దేవున్ని కోరుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు రవీందర్ రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక పూడి గాంధీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్న మిరియాల రాఘవ రావు, మిరియాల ప్రీతమ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here