చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేమనరెడ్డి కాలనీలో ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, డీసీ సుధాంష్, ఈఈ చిన్నారెడ్డిలు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ, కార్పొరేటర్ లు మాట్లాడుతూ భారీ వర్షాలకు కాలనీలో ఉన్న కొన్ని రోడ్లలో నీరు నిలిచిందని అన్నారు. ఎస్‌టీపీ ప్రహరీ గోడ కొత్తగా నిర్మించడం వలన ఈ సమస్య తలెత్తిందని, కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, శ్రీకాంత్, పోచయ్య, జహీర్, గౌస్, గాల్ రెడ్డి, లక్ష్మ రెడ్డి, బాపి రెడ్డి, రుక్మాత్ రెడ్డి, విజయ్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.