చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పేద ప్రజలకు ఒక పూట అన్నం పెట్టడంలో ఉన్న సంతృప్తి మరెందులో దొరకదని టీఆర్ఎస్ యువజన నాయకుడు మిరియాల ప్రీతమ్ అన్నారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో ఫుట్ పాత్ పై నిద్రించే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న పేదలకు బిర్యానీ ప్యాకెట్లను మిరియాల ప్రీతమ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. మానవసేవే మాధవసేవ అని భావించి పేద ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.