నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానదేంద్ర స్వామిని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదివారం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి పీఠాధిపతుల పర్యవేక్షణలో చందానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవములు ఘనంగా జరుపుకోవడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు.






