- ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పిలుపు
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): అందరం కలిసి కట్టుగా శ్రమించి శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ను గెలిపించుకోవాలని ఎన్నికల ఇంచార్జి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేసిన రవీందర్ యాదవ్ తో పాటు అసంతృప్తి నేతలతో ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎన్నికల ఇంచార్జి భూపాల్ రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ శనివారం మసీదు బండలో సమావేశమయ్యారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించేలా చూస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థి ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సమిష్టిగా కృషి చేసి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. తప్పకుండా రాగం నాగేందర్ యాదవ్ గెలుపుకోసం కలిసికట్టుగా పనిచేస్తామని రవీందర్ యాదవ్ తో పాటు నాయకులందరూ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు, మిరియాల రాఘవరావు, వార్డు మెంబర్లు రాంబాబు, రాము, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్, పద్మారావు, రమేష్, వేణుగోపాల్ రెడ్డి, చైతన్య పాల్గొన్నారు.
