చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మిని చందానగర్ మాజీ కౌన్సిలర్ గుఱ్ఱపు రవిందర్ రావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ దీట్ట ఐన కేకే వారసురాలు గద్వాల విజయలక్ష్మి మేయర్ స్థానం దక్కించుకోవడం సంతోషకరమని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల నమ్మకాన్ని నిలబెడుతుందని, హైదరాబాద్ అభివృద్ధిలో ఆమె మార్కు వేస్తుందనే ఆశాబావం వ్యక్తం చేశారు.