శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో నమోదు చేసిన 3303 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమవారం అందజేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇంత పెద్ద మొత్తంలో ఓటరు నమోదు చేయించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అభినందించారు.






