శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): టిపిసిసి జనరల్ సెక్రటరీ, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ జన్మదినం సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మేరీ ల్యాండ్ లో సీనియర్ కాంగ్రెస్ లీడర్ మిరియాల ప్రీతంఆధ్వర్యంలో పూల మొక్కలు నాటి జగదీశ్వర్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మిర్యాల ప్రీతం మాట్లాడుతూ జగదీశ్వర్ గౌడ్ ప్రజల మనిషి అని, రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా, మినిస్టర్ గా ఆయనను చూడాలని శేరిలింగంపల్లి ప్రజల కోరిక అని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో గోపాల్, ప్రసాద్, అనిల్, శ్రీధర్, మిలిత్, రియాన్ష్, విష్, సెంథన్, కీనన్, రాగిబ్, శ్రేయాన్ పాల్గొన్నారు.