శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమ నాయకురాలు విజయశాంతి జన్మదినం సందర్భంగా ఆమెను ఆమె స్వగృహంలో కలిసిన తెలంగాణ సర్పంచుల సంఘం వేదిక అధ్యక్షుడు భూమన్న యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆమెకు పుష్ప గుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, యువత అధ్యక్షుడు కుమార్ యాద, బత్తుల వరలక్ష్మి యాదవ్, లక్ష్మీ యాదవ్, రాణి యాదవ్, కరుణ, సరస్వతి, మాధవి, పండరి భూమన్న యాదవ్, పండరి గౌడ్, రమాదేవి, మాధవరెడ్డి, కరుణా శ్రీ, శంకర్ యాదవ్ పాల్గొన్నారు.