నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ప్రైమార్క్ సిగ్నస్ అసోసియేషన్ వాసులు పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల పై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో సీసీ రోడ్లు, తదితర మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు తెలిపారు. కాలనీలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. కాలనీ వాసులందరూ కలిసి కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అందరి కృషి తో ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ ప్రసాద్ దూబే, టీఆర్ఎస్ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, కాలనీ వాసులు సత్యరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అరవింద రెడ్డి, వాసుదేవ రావు, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.