కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు – ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు‌. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లికి చెందిన బిజెపి సీనియర్ నాయకులుసురేష్ నాయక్ ఆధ్వర్యంలో 200 మంది గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయి బాబా, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బిజెపి‌ నాయకులకు గులాబీ జెండా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లోకి రావడం శుభసూచకం అన్నారు.

గులాబీ‌‌ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు సైనికునిలా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని అన్నారు. బిజెపి నుండి టీఆర్ఎస్ లోకి చేరిన మహిళలు మాట్లాడుతూ బిజెపి పాలనలో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, నిత్యం పెరుగుతున్న నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. రోజుకు విపరీతంగా ధరలు పెంచుకుంటూ పోతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ విసిగిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగారావు తో పాటు బిజెపి నుంచి టీఆర్ఎస్ చేరిన నాయకులు సురేష్ నాయక్, ఇందిరా, రాకేష్, ఉమామహేష్, హేమలత, రమేష్, రాములు, శంకర్, రాజు నాయక్, పాండు నాయక్, దుర్గేష్, తరుణ్, విక్రమ్ సింగ్, శ్రీరామ్, హరి నాయక్,లక్ష్మీ, జంగమ్మ, జై బాయి, యువత ఉన్నారు‌. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మిరియాల రాఘవ రావు, అక్బర్ ఖాన్, విష్ణు వర్ధన్ రెడ్డి, నరేందర్ బల్లా, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారితో ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here