నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. దళితబంధు పథకంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధి వేమన వీకర్ సెక్షన్ కాలనీ కి చెందిన మౌలాలికి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కారును మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగారావు తో కలిసి ఎమ్మెల్యే గాంధీ అందజేశారు. అనంతరం చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్ క్లేవ్ హరిజన బస్తీకి చెందిన జ్యోతికి దళితబంధు కింద మంజూరైన కిరాణం అండ్ జనరల్ స్టోర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని చెప్పారు. దళిత బంధు పథకం మంజూరైన లబ్దిదారులు వారివారి ఇష్టమైన రంగాలను ఎంచుకుని జీవనోపాధి కల్పించుకోవడం సంతోషకరమన్నారు. వారి కాళ్లపై వారు సగర్వంగా తలెత్తుకొని జీవించేలా ఆర్థికంగా బలోపేతమయ్యేలా తోడ్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మిరియాల రాఘవరావు, అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా, వరలక్ష్మి రెడ్డి, మల్లేష్ , ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
