శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని ఓల్డ్ లింగంపల్లి గిడ్డంగిలో ఉన్న రావ్ ఫిట్‌నెస్ క్లబ్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్ట్రెంగ్త్ అండ్ కార్డియోలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో భాగంగా స్ట్రెంగ్త్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన నవీన్‌కు రూ.1500 నగదు అందజేశారు. హరీష్‌కు రెండో బహుమతి దక్కింది. అలాగే కార్డియో విభాగంలో ఆనంద్‌కు మొదటి బహుమతిగా రూ.1500, రెండో బహుమతి కింద సతీష్ చారికి మెడల్‌ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాగం అనిరుద్ యాదవ్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, రవి యాదవ్ పాల్గొన్నారు.