సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజావాణి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాల‌యంలో సోమవారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో క‌మిష‌న‌ర్ సృజ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కార్పొరేష‌న్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌లు తమ ఫిర్యాదుల‌ను సంబంధిత విభాగాల‌కు చెందిన అధికారులు, సిబ్బందికి అంద‌జేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అత్య‌ధికంగా 24 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్‌లో 7, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌లో 4, అర్బ‌న్ బ‌యో డైవ‌ర్సిటీలో 3, రెవెన్యూ విభాగంలో 2, చెరువులు, పారిశుద్ధ్యం, వెట‌ర్న‌రీ విభాగాల్లో ఒక్కో ఫిర్యాదు చొప్పున అందాయ‌ని, మొత్తం 43 ఫిర్యాదుల‌ను స్వీక‌రించామ‌ని అధికారులు తెలిపారు. అన్ని ఫిర్యాదుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని అధికారులు, సిబ్బందికి క‌మిష‌న‌ర్ సృజ‌న‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here