బసవేశ్వరుడు సమానత్వం, సత్యం, సేవకు ప్రతీక: ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ. నగర్ కాలనీలో శ్రీ వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలలో మియాపూర్ డివిజన్ నాయకులు, కాలనీ వాసులతో కలసి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ మహాత్మా శ్రీ బసవేశ్వరుడు సమానత్వం, సత్యం, సేవకు ప్రతీక అని కొనియాడారు. ఆయన కేవలం మతపరమైన గురువు మాత్రమే కాకుండా గొప్ప సమాజ మార్గదర్శి అని పేర్కొన్నారు. సమానత్వం, సేవ, నిజాయితీ వంటి విలువలను మన జీవితంలో పాటించాలని బోధించిన మహానుభావుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ నాయకులు, వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు శేఖర్, ప్రభు, రాజు, నరేందర్, వీరేశం, విజయ్, జంగం మల్లేష్, లింగాయత్ శివ, వీరన్న, స్థానిక నాయకులు శివ, చందు, ఎం.ఏ. నగర్ బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here