నమస్తే శేరిలింగంపల్లి: కోరోన నేపథ్యంలో ఆర్ధికంగా చతికిల బడ్డ ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి రూ.2వేలతో పాటు బియ్యం పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం విదితమే. ఐతే అందుకు సంబంధించిన విధాన ప్రక్రియ సైతం జోరందుకుంది. ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న సిబ్బంది ప్రభుత్వ సహాయం కోసం ఈ నెల 10 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునచ్చింది. ఈ నేపథ్యంలో ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా వాటి పరిశీలన కొనసాగుతుంది. అర్జీదారుల వివరాలను ప్రభుత్వానికి పంపించడంతో విద్యాశాఖ సిబ్బంది తనమునకలయ్యారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ పోర్టల్‌లో ఇప్పటికే పొందిపరచబడి ఉన్న వివరాలతో తాజా దరఖాస్తు దారుల వివరాలను ట్యాలీ చేసి చూస్తున్నారు. దాంతో పాటు అర్జీదారుల ఆదార్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించే పనిలో నిమగ్నమయ్యారు.
నాలుగు కాంప్లెక్సుల వారిగా ధరఖాస్తుల స్వీకరణ…
శేరిలింగంపల్లి మండల పరిధిలో మొత్తం 229 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా వాటిని నాలుగు కాంప్లెక్స్ పరుధిలుగా విభజించారు. శేరిలింగంపల్లి కాంప్లెక్స్ పరిధిలో 54, మియాపూర్‌లో 91, కొత్తగూడలో 60, రాయదుర్గం పరిధిలో 17 పాఠశాలలను పరిగణలోకి తీసుకున్నారు. కాగా మొత్తం 229 ప్రైవేట్ పాఠశాలలోంచి 154 పాఠశాలల యాజమాన్యాలు తమ సిబ్బంది పూర్తి వివరాలను కాంప్లెక్స్‌లకు అందజేశారు. మిగిలిన పాఠశాలల యాజమన్యాలు తమ సిబ్బందికి పూర్తి/సగం చొప్పున జీతాలు చెల్లిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సహకారానికి ముందుకు రాలేవు. ఇప్పటివరకు మొత్తం 3734 మంది టీచర్ల ధరఖాస్తులను తమ వద్దకు చేరినట్టు శేరిలింగంపల్లి ఎంఈఓ వెంకటయ్య నమస్తే శేరిలింగంపల్లికి వివరించారు. డీఈఓ విజయకుమారి, పర్యవేక్షణ అధికారి, కడ్తాల్ ఎంపీడీఓ రామకృష్ణల వివరాల సేకరణను పరిశీలించారని, వాటిని విద్యాశాఖకు చేరవేయనున్నట్టు తెలిపారు.