చందానగర్ డివిజన్ నుంచి రాంచందర్ రాజు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు జెరిపేటి రాంచందర్ రాజు బుదవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిశారు. చందానగర్ డివిజన్ నుంచి తమ కుటుంబసభ్యులకు టిక్కెట్ కేటాయించాలని కోరుతూ గాంధీకి ప్రొఫైల్‌ను అందజేశారు. చందానగర్‌లోని అన్ని వర్గాల ప్రజలతో తమకు సన్నిహిత సంబంధాలన్నాయని, తమకు అవకాశం ఇస్తే క్షేత్రస్థాయిలో పార్టీని బలపరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్‌రెడ్డి, నాయకులు దాసరి గోపికృష్ణ, రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ నుంచి బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి
గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల గ్రామానికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి బుదవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసి తన బయోడాటాను అందజేశారు. గచ్చిబౌలి డివిజన్ నుంచి తనకు కార్పొరేటర్‌గా అవకాశం కల్పించాలని గాంధీని కోరారు. డివిజన్‌లోని గ్రామాల్లోని స్థానికులతో పాటు అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలున్నాయని, టిక్కెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిచి వస్తానని అన్నారు. సత్యనారాయణ రెడ్డితో పాటు నల్లగండ్ల గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గాంధీని కలిశారు. సత్యనారాయణ రెడ్డికి తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని తెలిపారు.
