- కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదిత్యనగర్ వాసులు
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ న్యూ హఫీజ్‌పేట్ ఆదిత్య నగర్‌కు చెందిన స్థానికులు టీపీపీసీ కార్యదర్శి గంగల రాధకృష్ణ యాదవ్ ఆద్వర్యంలో పెద్ద సంఖ్యలో బుదవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ ఎం.రవికుమార్ యాదవ్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యిందని, కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని గుర్తెరిగి ప్రజలు స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరడం శుభసూచకమని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌కు చెందిన నాయకులు పాల్గొన్నారు.
