శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): నిర్వహణ పనుల దృష్ట్యా శనివారం (జూన్ 27) హైదర్‌నగర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు హైదర్‌నగర్ ఆపరేషన్ ఏఈ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మయూరి నగర్ సబ్‌స్టేషన్‌కు చెందిన 11 కేవీ గోకరాజు రంగరాజు ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో గోకరాజు కాలేజీ రోడ్డు, విజ్ఞాన్ స్కూల్ పరిసర ప్రాంతాలు ప్రభావితమవుతాయి. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మయూరి నగర్ సబ్‌స్టేషన్‌కు చెందిన 11 కేవీ బాలాజీ నగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో బాలాజీ నగర్ కాలనీ, ఆర్‌ఎల్ సిటీ, వెంకట్‌రాయ్ నగర్ కాలనీ వెనుక ప్రాంతాలు విద్యుత్ అంతరాయానికి గురికానున్నాయి. నిర్వహణ పనుల కారణంగా వినియోగదారులకు కలిగే అసౌకర్యానికి విద్యుత్ శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ప్రజలు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.





