శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ముఖ్యమైన ప్రాంతాలను సైబరాబాద్ సీపీ సందర్శించారు. గంగారం, మై హోం మంగళ రైల్వే అండ్ బ్రిడ్జి ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరుతుందని దీని వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని అన్నారు. వెంటనే వరద నీటిని తొలగించాలని, అవసరం అయితే ట్రాఫిక్ ను మళ్లించేలా చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఇందుకు గాను అవసరం అయితే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు.






