హెచ్‌సీయూ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఏబీవీపీ విద్యార్థుల‌కు స‌న్మానం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా కమ్యూనిటీ హాల్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎన్ ఎస్ యు ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల విద్యార్థులపై విజయం సాధించిన ఎబివిపి విద్యార్థులను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎబీవీపీ జాతీయ కార్యదర్శి ఆషిష్ చౌహాన్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత కృషి చేయాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీలో విజయం సాధించి విద్యార్థుల సమస్యలు తీర్చడం లో కీలకపాత్ర పోషించనున్న వారంద‌రికీ అభినందనలు అంటూ వారి విజయ కీర్తిని ప్రశంసించారు.

ప్రెసిడెంట్‌గా శివ పాలేపు, వైస్ ప్రెసిడెంట్‌గా దేవేంద్ర, జనరల్ సెక్రటరీగా శృతి, జాయింట్ సెక్రటరీగా సౌరబ్ శుక్ల, స్పోర్ట్స్ సెక్రటరీ గా జ్వాల ప్రసాద్, కల్చరల్ సెక్రెటరీ గా వీనస్ విజయం సాధించారు. స్కూల్ స్థాయిలో కౌన్సిలర్లు, బోర్డు మెంబర్లలో విజయం సాధించి ఏబీవీపీ మెజారిటీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింద‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్ రాందీన్, రంగారెడ్డి జిల్లా అర్బన్ వైస్ ప్రెసిడెంట్ మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్, సేవ పక్షం కన్వీనర్ గంగల రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకురాలు వరలక్ష్మి ధీరజ్, సీనియర్ నాయకులు శ్రీరాములు, తిరుపతి,ప్రసాద్, రంగస్వామి, రమేష్, నిఖిల్ యాదవ్, డివిజన్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here