శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పై పోలీస్ శాఖ ప్రవర్తించిన తీరుకు నిరసనగా బుధవారం శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ కుమ్మరి జితేందర్ ఆధ్వర్యంలో గుల్ మోహర్ పార్క్ చౌరస్తా దగ్గర సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అశ్లీల చిత్రం డర్టీ హరి లాంటి చిత్రాల వల్ల యువత తప్పుదోవ పట్టేందుకు ఆస్కారం ఉన్నందున, ఈ చిత్ర ప్రదర్శనను వెంటనే ఆపాలని భారతీయ జనతా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఆధ్వర్యంలో చిత్రాన్ని ప్రదర్శిస్తున్న టివోలి సినిమా హాల్ ముట్టడికి యత్నిస్తే ఆయన పట్ల పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వ్యవహరిస్తున్న తీరును బీజేవైఎం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు జీతాలు ఇస్తుంటే పోలీసులు తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం దారుణం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు చంద్రమోహన్, బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ గౌడ్, మధు యాదవ్, అరవింద్ సింగ్, బీజేవైఎం నాయకులు శివ గౌడ్, రాజేందర్ రెడ్డి, అజయ్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు క్రాంతి, సిద్దూ, మధుసూదన్ రావు, ఆనంద్ కుమార్, శివ కుమార్, బీజేవైఎం నాయకులు భరత్ కుమార్, సాయి, అచ్యుత్ రెడ్డి, కిరణ్, సాయి కృష్ణ, సతీష్ గౌడ్, శివ శంకర్ గౌడ్, టి.సాయి కిరణ్, అరుణ్, రమేష్ నాయక్, శ్రవణ్, భారత్, సందీప్, వినోద్ చౌదరి, వెంకట్ పాల్గొన్నారు.





