గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు రవికమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారమవుతామని అన్నారు. శిబిరంలో రక్తదానం చేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







