ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ 19 టీకా పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఉదయం 10.30 గంటలకు మోదీ వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా శనివారం మొత్తం 3,006 కేంద్రాల్లో 3 లక్షల మందికి వ్యాక్సిన్‌లను ఇవ్వనున్నారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు ముందుగా టీకాలను ఇస్తున్నారు. తరువాత 50 ఏళ్లకు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి టీకాలను ఇస్తారు. ఆ తరువాతే సాధారణ ప్రజలకు టీకా పంపిణీ కార్యక్రమం ఉంటుంది.
వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర 1.1 కోట్ల కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఒక్కో డోసు రూ.200, రూ.206 చొప్పున కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపించింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లోనూ శనివారం నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.