యాదవులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి: భేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు దేశం అభివృద్ధి కోసం సూర్యుడు ఉదయించక ముందు లేచి పాల వ్యాపారం చేస్తార‌ని, గొర్రెలు, మేకల‌ను మేపుతూ ఒక రైతన్నగా వ్యవసాయం చేస్తూ పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నార‌న్నారు. భారత దేశ వ్యాప్తంగా 25 శాతం ఉన్న యాదవులకు రాజకీయ పరంగా అన్ని విధాలా అన్యాయమే జరుగుతుంద‌ని అన్నారు. దామాషా పద్ధతిలో యాదవులకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

అఖిల భారత యాదవ మహాసభ నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్క‌రిస్తున్న భేరి రామచందర్ యాదవ్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో యాదవులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ ఫిబ్రవరిలో మేయర్ ఎన్నిక జరగబోతుంద‌ని, బీసీ సామాజికవర్గానికి చెందిన యాదవులకు మేయర్ పదవి ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి విన్నవించుకుంటున్నామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో గోకుల్ నెరుసు శ్రీధర్ యాదవ్, శేరిలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అందెల సత్యనారాయణ యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు చందు యాదవ్, గోకుల్ యూత్ అధ్యక్షుడు కొలుసు వంశీకృష్ణ యాదవ్‌, స్వామి యాదవ్, మాగంటి సతీష్ యాదవ్, మాగంటి హరీష్ యాదవ్, మాగంటి చంద్రమోహన్ యాదవ్, రంగారెడ్డి జిల్లా యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here