నిధులు లేక ప్రజలను వెక్కిరిస్తున్న శిలాఫ‌లకాలు: బొబ్బ నవత రెడ్డి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 28 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): నిధులు లేక గత 2 సంవత్సరాలుగా శిలా ఫ‌లకాలు ప్ర‌జ‌ల‌ను వెక్కిరిస్తున్నాయ‌ని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. MLA ఎన్నికల సమయంలో పెట్టిన శిలాఫ‌లకాలకే దిక్కు దీవాణం లేద‌ని, కార్పొరేటర్ (GHMC) ఎన్నికలు వస్తున్న సమయంలో మళ్ళీ కొత్త శిలాఫ‌లకాల ఏర్పాటు నాటకం అని, GHMC లో నిధులు నిల్లు, నియోజకవర్గం లో శిలాఫ‌లకాలు ఫుల్లు అని అన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారాను అంటున్న MLA మరి పనులు ఎందుకు చేయలేక పోతున్నార‌ని ప్ర‌శ్నించారు. శంకర్ నగర్ కాలనీ లో గత 2 సంవత్సరాల క్రితం పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన శిలాఫ‌లకం కాలనీ ప్రజలను వెక్కిరిస్తుంద‌న్నారు. మళ్ళీ నిన్న అదే శంకర్ నగర్ కాలనీ లో కొత్త శిలాఫ‌లకం ఉదయించింద‌న్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇలాంటివి వందల శిలాఫ‌లకాలు పనులు చేయక ప్రజలను వెక్కిరిస్తున్నాయ‌ని, కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం శిలాఫ‌లకాలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నార‌ని అన్నారు. GHMC ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ హడావిడిగా 5 కోట్ల రూపాయల నిధుల మంజూరు అని శిలాఫ‌లకాలు ఏర్పాటు చేశార‌ని, గ‌త 2 సంవత్సరాల క్రితం MLA ఎన్నికల ముందు ప్రజల ఓట్ల కోసం ఏర్పాటు చేసిన శిలాఫ‌లకాల పనులే మొదలు కాలేద‌ని అన్నారు. మరొక్క సారి మళ్ళీ కొత్త శిలాఫ‌లకాల ఏర్పాటుతో ప్రజలను మోసం చేస్తున్నార‌ని, చందానగర్ డివిజన్ శంకర్ నగర్ కాలనీ లో MLA SDF నిధుల ద్వారా 15 లక్షల రూపాయలతో యూత్ భవనం నిర్మాణం అని శిలాఫ‌లకం ఏర్పాటు చేసి ఓట్లు దండుకున్నారు కానీ ఇంత వరకు పనులు కాలేద‌ని అన్నారు. ఇలాంటివి నియోజకవర్గంలో వందకు పైగా ఉన్నాయని, ప్రజలను మభ్యపెట్టి GHMC ఎన్నికల్లో ఓట్లు పొందడానికి శిలాఫ‌లకాల నాటకాన్ని మళ్ళీ మొదలు పెట్టార‌ని అన్నారు. ప్రజలు మోసపూరిత మాటలు నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ పరనంది, సలీం, చందర్ రావు, గౌస్, అనంత రెడ్డి, మల్లేష్, ఉపేందర్, కాలనీ వాసులు అర్జున్ యాదవ్, రామా రావు, రాజు, శారదా, శ్రీనివాసులు, కోటేశ్వరరావు, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here