శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో మదీనాగూడ డివిజన్ RTC కాలనీకి చెందిన BRS సీనియర్ నాయకుడు దేవేందర్ బీజేపీలో చేరిన సందర్బంగా బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధే లక్ష్యంగా, పారదర్శక పాలనతో, ప్రజాకేంద్రిత విధానాలతో ముందుకు సాగుతున్న బీజేపీపై విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవేందర్ పేర్కొన్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో తన వంతు నిబద్ధత చూపుతాను అని, బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ నాయకులకు, ప్రజలతో ఉన్న బలమైన అనుబంధమే పలువురు నాయకులు బీజేపీ వైపు ఆకర్షితులవడానికి కారణమవుతోందని దేవేందర్ అన్నారు. ఈ చేరికతో బీజేపీ మరింత బలపలుడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కౌన్సిలర్ రమణయ్య, సత్యనారాయణ రాజు, పాలెం శ్రీనివాస్, నరసింహ, రాజు యాదవ్, శేఖర్ వెంకటేష్, రామ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బాలరాజు, వినయ్, నాగేష్, నరసింహ ముదిరాజ్, శ్రీకాంత్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.






