సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీటీసీ ప్రాంగణంలో సీపీ వీసీ సజ్జనార్ గురువారం మొక్కలు నాటారు. కమిషనరేట్ పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది కలిసి మొత్తం 1200 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, ఏడీసీపీ మాణిక్ రాజ్, అడ్మిన్ ఏడీసీపీ లావణ్య ఎన్జేపీ, సీఎస్డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మీ నారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





