క‌రోనా వ్యాక్సిన్ డ్రై ర‌న్ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో

చందాన‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్‌లోని పీఆర్‌కే హాస్పిట‌ల్‌లో ఈ నెల 9వ తేదీన క‌రోనా వ్యాక్సిన్ డ్రై ర‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో డ్రై ర‌న్ నిర్వ‌హ‌ణ‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను గురువారం శంషాబాద్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ సృజన పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె డ్రై రన్ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను హాస్పిటల్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ నెల 9వ తేదీన నిర్వ‌హించ‌నున్న డ్రై ర‌న్‌ను మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌లు ప‌రిశీలిస్తార‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హాస్పిటల్ నిర్వాహకుడు పుట్ట రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

క‌రోనా వ్యాక్సిన్ డ్రై ర‌న్ ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్న శంషాబాద్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ సృజన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here